విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి- అనంతగిరి మార్గంలో దేవరాపల్లి శారదా నదిపై రూ.ఆరు కోట్ల నిధులతో వంతెన నిర్మాణ పనులు చేపట్టారు. వంతెన నిర్మాణ పనులు పూర్తి చేసినా.. నిధులు చాలక వంతెనకు రెండువైపులా అప్రోచ్ నిర్మించలేదు. కొన్నేళ్లుగా పనులు పూర్తి చేయకుండా అసంపూర్తిగానే వదిలేశారని సీపీఎం నాయకులు మండిపడ్డారు. దేవరాపల్లి, అనంతగిరి మండలాలకు చెందిన దాదాపు 200 గిరిజన గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాత్కాలికంగా నదిపై ఏర్పాటు చేసిన కాలిబాట నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలకు కాలిబాట దెబ్బతింది. దేవరాపల్లి, అనంతగిరి గిరిజన గ్రామాలకు చెందిన గిరిజనులు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. కొన్నేళ్లుగా అసంపూర్తిగా ఉన్న వంతెన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు
ఇదీ చూడండి