ఎన్నో ఏళ్లుగా గిరిజనులు అభివృద్ధికి దూరంగా బతుకుతున్నారని ఆదివాసీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఐకాస ఛైర్మన్ చెండా ఏలియా అన్నారు. వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఆయా ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. విశాఖ మన్యం గూడెం కొత్తవీధి మండలం దారకొండలో ఆయన పర్యటించారు.
ఏజెన్సీలో అక్రమ మైనింగ్ జరుగుతుందని చెండా ఏలియా ఆరోపించారు. గిరిపుత్రులకు చెందవలసిన భూమిలో కొందరు అక్రమదారులు మైనింగ్ చేపడుతున్నారని మండిపడ్డారు. జీవో నెంబర్ 3ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, పాఠశాల, ఆస్పత్రులు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. భూములు లేక గిరిపుత్రులు వలస కూలీలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వారికి ఇళ్లు, సాగు పట్టాలు అందజేయాలని ఏలియా కోరారు.
ఇవీ చదవండి..
విశాఖ ఏజెన్సీలో మినరల్ వాటర్ ట్యాంక్ ప్రారంభించిన పోలీసులు