విశాఖ జిల్లా పరవాడ మండలంలోని పెద్ద చెరువులో భారీగా చేపలు చనిపోయాయి. ఏటా వర్షాకాలంలో ఈ చెరువులో పెద్దఎత్తున చేపల పెంపకం చేపడతారు. బాగా పెరుగుతున్న సమయంలో ఒక్కసారిగా టన్నుల కొద్ది చేపలు మృత్యువాత పడటంతో గ్రామ ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
చనిపోయి నీటిపై తేలుతున్న చేపలను చూసి గ్రామస్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఫార్మాకంపెనీల నుంచి విడుదలయ్యే వ్యర్ధాలు చెరువులో కలియడం వల్లనే పెద్ద సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయని ఆరోపిస్తున్నారు. రసాయన శుద్ధి చేయని వ్యర్థాల వల్ల నీటిలో ఆక్సిజన్ బాగా తగ్గిపోయి చనిపోయాయని అంటున్నారు. ఇది తమ ఉపాధిని దెబ్బతీసిందని వాపోతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఇదీ చదవండి: