విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో తెదేపా నేత అయ్యన్నపాత్రుడు, కార్యకర్తలు నిరసన ఆపేయాలని కోరుతూ పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. కార్యకర్తలు, పోలీసులతో కాసేపు ముచ్చటించిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నిరసన కార్యక్రమాన్ని నిలిపే ప్రసక్తి లేదని తెలిపారు. దీంతో పోలీసులు అక్కడినుంచి వెళ్లిపోయారు.
తెదేపా అధినేత చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెదేపా శ్రేణులు నిరసనకు పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు స్థానిక ఆర్డీవో కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం మధ్యాహ్నం నుంచి కార్యకర్తలు మాజీమంత్రి నివాసానికి చేరుకుంటున్నారు. విషయం గుర్తించిన పోలీసులు రంగంలోకి దిగి... అయ్యన్న పాత్రుడు నివాసాన్ని మోహరించారు.
అయ్యన్న పాత్రుడిని కలిసి ర్యాలీకి అనుమతి లేదని... ఇళ్లు కదిలి బయటకు రావొద్దని పోలీసులు తెలిపారు. దీనిని వ్యతిరేకించిన తెదేపా నేతలు కచ్చితంగా నిరసన చేసి తీరుతామని తెలిపారు. శాంతియుతంగా చేసే నిరసనకు అడ్డుచెప్పడం సరికాదని ఖండించారు.
ఇదీ చూడండి:
CM Jagan letter to PM: ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు సీఎం జగన్ లేఖలు