ETV Bharat / state

ఆఖరి నిమిషంలో నిలిచిన కొవిడ్‌ నియామకాలు

వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన రెండు ఆసుపత్రులు. ఒకచోట కొలువుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసి నియామక పత్రం ఇచ్చినా కొత్తగా ఖాళీలొచ్చాయి... మళ్లీ దరఖాస్తు చేసుకోమని అంటున్నారు. అదే ఇంకోచోట కొత్త ఖాళీలు కొత్తవే.. పాత నియామక ప్రక్రియ పాతదే అంటున్నారు. దీంతో విస్తుపోవడం నిరుద్యోగుల వంతవుతోంది.

author img

By

Published : Jul 7, 2020, 3:40 PM IST

shoping Covid
shoping Covid

విశాఖ జిల్లాలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని కొవిడ్‌ ఆసుపత్రుల్లో 39 స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు మొదట నోటిఫికేషన్‌ ఇవ్వగా 954 మంది పోటీపడ్డారు. వీరిలో అర్హులను గుర్తించి నియామక ఉత్తర్వులు ఇవ్వడం కోసం దస్త్రాన్ని కలెక్టర్‌ కార్యాలయానికి పంపించారు. కలెక్టర్‌ సంతకం పెట్టడమే తరువాయి... వారంతా కొలువుల్లో చేరిపోవడమే మిగిలుంది. ఈలోగా ప్రభుత్వం మరో 29 అదనపు స్టాఫ్‌ నర్స్‌ పోస్టులను మంజూరు చేసింది. వీటిని ఏడాది కాలపరిమితితో కాకుండా ఒప్పంద పద్ధతిలో నియమించాలని ఆదేశాలిచ్చింది. దీంతో.. పాత, కొత్త పోస్టులను కలిపి 68 స్టాఫ్‌నర్స్‌ పోస్టుల భర్తీకి ఇటీవలే మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఈసారి ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇవి కాలపరిమితితో సంబంధం లేని ఉద్యోగాలు కాబట్టి కొత్తవారితో పాటు గతంలో కొవిడ్‌ కొలువులకు పోటీపడిన వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలన్నారు.

గత నోటిఫికేషన్‌లో ఎనిమిది ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు 350 వరకు పోటీపడ్డారు. వారిలో ఎంపికైన ఎనిమిది మందికి సంయుక్త కలెక్టర్‌ చేతుల మీదుగా నియామక పత్రాలు అందించారు. ఆ తరవాత రెండు రోజులకే మరో నాలుగు అదనపు పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. కొత్త నోటిఫికేషన్‌లో మొత్తం 12 పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు పేర్కొన్నారు. వీటిలో ఎన్ని భర్తీ చేయనున్నారో సంబంధిత శాఖకే స్పష్టత లేకుండా పోయింది. తాజాగా నియామక పత్రాలు అందుకున్నవారిని కూడా తిరిగి దరఖాస్తు చేసుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఒకసారి ఉద్యోగం ఇచ్చిన తరువాత మరలా దరఖాస్తు చేయడమేంటని ప్రశ్నిస్తే మీవి ఏడాది కొలువులే. అదే కొత్తగా దరఖాస్తు చేసుకుని ఎంపికైతే ఎన్నాళ్లయినా కొనసాగడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. దీంతో చేసేది లేక నియామక పత్రాలు అందుకున్నవారు కూడా మరోసారి ఈ పోస్టులకు పోటీపడక తప్పడం లేదు.

కేజీహెచ్‌లో కొవిడ్‌ సేవల కోసం 139 స్టాఫ్‌నర్స్‌ పోస్టుల భర్తీకి మొదటి నోటిఫికేషన్‌ ఇచ్చారు. వీటి నియామక ప్రక్రియ తుదిదశలో ఉంది. తాజాగా ప్రభుత్వం కేజీహెచ్‌లో 251 స్టాఫ్‌నర్స్‌ పోస్టుల భర్తీకి అవకాశం కల్పించింది. అయితే వీరు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలా పాత నోటిఫికేషన్‌ను రద్దు చేయలేదు. కొవిడ్‌ కొలువులను భర్తీ చేస్తూనే కొత్త పోస్టులకు వేరుగా నోటిఫికేషన్‌ ఇవ్వడం విశేషం. వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేసే కేజీహెచ్‌లో ఒకలా, డీఎంహెచ్‌ఓ పరిధిలో మరొకలా పోస్టుల భర్తీ జరుగుతుండడం గమనార్హం.

అధికారులేమంటున్నారంటే..

మా పరిధిలో భర్తీచేస్తున్న స్టాఫ్‌నర్స్‌, ఇతర పోస్టులకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా మరోసారి దరఖాస్తు చేసుకోవాలనే చెబుతున్నాం. మొదట్లో కొవిడ్‌ సేవలు, ఏడాది కాలానికే నోటిఫికేషన్‌ ఇచ్చాం. ఇప్పుడు రెగ్యులర్‌ సేవలతో పాటు ఏడాది కాలపరిమితి లేకుండా భర్తీ చేయబోతున్నాం. దీనివల్ల వారికే మేలు జరుగుతుంది. - డా.విజయలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్‌వో

కేజీహెచ్‌లో కొవిడ్‌ సేవల కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌కు ప్రస్తుతం భర్తీ చేయబోతున్న కొత్త పోస్టులకు సంబంధం లేదు. కొవిడ్‌ కొలువుల ప్రక్రియ కొనసాగుతుంది. కొత్త పోస్టులను రెగ్యులర్‌ పద్ధతిలో నియమించుకుంటాం. - డా.అర్జున్‌, కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌

-

ఇదీ చదవండి:

సైన్యంలో మహిళా కమిషన్ ఏర్పాటుకు మరో నెల గడువు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.