ప్రకటనల స్వార్థానికి వృక్షాలు బలి..
కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్న పట్టణాలలో అక్కడ అక్కడ చెట్లు దర్శనమిస్తాయి. ఇప్పుడు ఆ ఉన్న చెట్లనీ మేకులతో, కరెంట్ తీగలతో వాటి కణవ్యవస్థను నాశనం చేస్తున్నారు. నలుగురూ చూసేందుకు అనువుగా ఉంటుందని,.. ఉచితంగా టాక్స్ కట్టక్కర్లేకుండా చిన్నబోర్టు, రేకు, మేకులతో కొట్టి చెట్టు ప్రాణం తీస్తున్నారు. వందేళ్లకుపైబడి పెరగాల్సిన చెట్టు కూడా త్వరగా డొల్లగా, నిర్జీవంగా మారుతోంది. జైలమ్, దారుకణాలకు పోషకాలు అందక. కణమధ్యభాగం దెబ్బతింటుంది.దీంతో చెట్టు ఎండిపోతుంది.
వీటిపై అవగాహన తప్పనిసరి..
చెట్టుకు మేకులు కొట్టొద్దని చెప్పడానికే పర్యావరణవేత్తలు, స్వచ్చంద సంస్థలు నిరంతరాయంగా యత్నిస్తూనే ఉన్నాయి. చెట్టుకు మేకులు కొట్టినవారికి వెయ్యి రూపాయిల వరకు జరిమానా విధిస్తోంది ఒడిశాలోని బరంపురం మున్సిపల్ కార్పోరేషన్. విజయవాడ,విశాఖపట్నం,గుంటూరు, రాజమహేంద్రవరం వంటి నగరాల్లోనూ ఈ సమస్య తీవ్రత నానాటికి పెరిగిపోతోంది.
చిన్నదేశంగా ఉన్న బంగ్లాదేశ్‌లో ఓ సామన్య రైతు ఈ వృక్షాలకు జరుగుతున్న నష్టాన్ని నివారిండానికి శ్రమిస్తున్నాడు. మేకులను తొలగించి అక్కడ పడిన రంధ్రంలో ఓ మిశ్రమం ఉంచి చెట్లు కాపాడుతున్నాడు. ఇలా అన్ని ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడితే వాటి ఆయుష్సు పెంచినవాళ్లమవుతాం. చెట్లు నాటకపోయినా పర్వాలేదు... మేకులు కొట్టి చంపొద్దంటున్నారు పర్యావరణవేత్తలు.
ఇదీచూడండి.వ్యర్థం....తీరానికి అనర్థం