విశాఖ మన్యం కడపవలస వద్ద ఆటోలో తరలిస్తున్న రాయితీ బియ్యం బస్తాలను స్థానిక గిరిజనులు పట్టుకున్నారు. మూడు ఆటోల్లో సుమారు మూడున్నర టన్నుల బియ్యాన్ని సరిహద్దు రాష్ట్రమైన ఒడిశాకు తరలిస్తుండగా అడ్డుకున్నారు. స్థానిక రెవిన్యూ అధికారులకు అప్పగించారు. పేదలకు చేరాల్సిన బియ్యం పక్కదారి పడుతోందని, దీనిని అధికారులు నియంత్రించాలని గిరిజనులు కోరారు. బియ్యం విలువ సుమారు 2 లక్షలుంటుందని ఆర్ఐ లక్ష్మణమూర్తి తెలిపారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు.
ఇవీ చదవండి
ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం.. తన ఆటోకు తానే నిప్పు పెట్టిన కార్మికుడు