రెండు నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 2020 - 21 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని అమలు చేయాలంటూ దళిత విద్యార్థుల తల్లిదండ్రులు విశాఖలో ఆందోళన చేపట్టారు. దళిత విద్యార్థులను చదువులకు దూరం చేసే ఉద్దేశంతో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకానికి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఆవరణలో కళ్ళకు గంతలు కట్టుకొని మోకాళ్లపై నిరసన చేపట్టారు. అధికారులు స్పందించి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
'బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని అమలు చేయాలి' - visakha dist latest news
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకంపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ దళిత విద్యార్థుల తల్లిదండ్రులు విశాఖలో ఆందోళన చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. 2020-21 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
రెండు నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 2020 - 21 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని అమలు చేయాలంటూ దళిత విద్యార్థుల తల్లిదండ్రులు విశాఖలో ఆందోళన చేపట్టారు. దళిత విద్యార్థులను చదువులకు దూరం చేసే ఉద్దేశంతో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకానికి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఆవరణలో కళ్ళకు గంతలు కట్టుకొని మోకాళ్లపై నిరసన చేపట్టారు. అధికారులు స్పందించి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
TAGGED:
విశాఖ జిల్లా తాజా వార్తలు