ETV Bharat / state

'ముందస్తు పరీక్షలతో కిడ్నీ వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు' - Media conference at the Press Club in Visakhapatnam news

ముందస్తు పరీక్షల ద్వారానే కిడ్నీ వ్యాధుల నుంచి కాపాడవచ్చని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ, యురాలజీ వైద్యులు తెలిపారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా విశాఖలోని ప్రెస్ క్లబ్​లో ఆసుపత్రి వైద్యులు మీడియా సమావేశం నిర్వహించారు. మూత్రపిండాల వ్యాధులకు సంబంధించి పలు సూచనలు చేశారు.

press meet
విశాఖలోని ప్రెస్ క్లబ్​లో మీడియా సమావేశం
author img

By

Published : Mar 11, 2021, 9:53 PM IST

ముందస్తు పరీక్షల ద్వారానే కిడ్నీ వ్యాధుల నుంచి కాపాడవచ్చని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ, యురాలజీ వైద్యులు తెలిపారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా విశాఖలోని ప్రెస్ క్లబ్​లో మీడియా సమావేశం నిర్వహించారు. మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు రక్త, మూత్ర పరీక్షల ద్వారా మాత్రమే గుర్తింపబడతాయని అన్నారు. ఇటీవల కాలంలో ఎక్కువ మంది కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సంబంధిత క్యాన్సర్ వంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వీటి గురించి అవగాహన కల్పించేందుకు తమ ఆస్పత్రి ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ''మహా'లో ఆందోళనకరంగా కరోనా విజృంభణ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.