ఈ నెల 25న ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో మల్కన్‌గిరి జిల్లా జంతురాయ్‌లో తమ కార్యకర్తలపై జరిగిన దాడి పై పోలీసులు, మీడియా అసత్య ప్రచారం చేస్తోందంటూ సీపీఐ మావోయిస్టు ఏవోబీ కార్యదర్శి గణేష్ ఆడియో టేపు విడుదల చేశారు. ఈ నెల 25 రాత్రి జంతురాయ్, జొడొంబో, సింధుపడా గ్రామంలోని ప్రజా వ్యతిరేకులు, పోలీసు ఏజెంట్లు కలిసి దాడి చేసి నిరాయుధులుగా ఉన్న మావోయిస్టు పార్టీ సభ్యులను హతమార్చారని అందులో పేర్కొన్నారు. చాలా ఏళ్లుగా తాము ఏవోబీ ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్నామని.... ఇది మింగుడు పడక పోలీసులు క్యాంపులు ఏర్పాటు చేశారని ఆరోపించారు. పార్టీ వ్యతిరేకులను వదిలి పెట్టమని హెచ్చరించారు. పోలీసులకు దూరంగా ఉంటూ గ్రామస్థులు సాధారణ జీవితం గడిపితేనే పార్టీ వారిని వదిలేస్తుందన్నారు.
సంబంధిత కథనం: భయం గుప్పిట గిరిజనం.. ఏఓబీ సరిహద్దులో ఉద్రిక్తత