ETV Bharat / state

సోదరుడిని నాటు తుపాకీతో కాల్చి హత్య - vishaka district latest crime news

కుటుంబ కలహాలతో సొంత అన్నను తమ్ముడు దారుణంగా చంపాడు. ఈ ఘటన విశాఖ మన్యంలోని కుంతుర్ల గ్రామంలో జరిగింది.

man murdered his own in vishaka agency
man murdered his own in vishaka agency
author img

By

Published : Aug 24, 2020, 7:09 PM IST

విశాఖ మన్యంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో సొంత అన్నను నాటు తుపాకీతో కాల్చి తమ్ముడు హత్య చేశాడు. పెదబయలు మండలం కుంతుర్ల గ్రామానికి చెందిన కొంటా రాంబాబు, కృష్ణారావు అన్నదమ్ములు. కుటుంబ కలహాలతో కొన్ని రోజులుగా వీరు ఘర్షణ పడుతున్నారు. ఆదివారం రాత్రి గొడవ తారస్థాయికి చేరింది. సహనం కోల్పోయిన కృష్ణారావు... నాటు తుపాకీతో అన్న రాంబాబు(40)ను కాల్చాడు. బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

మారుమూల ప్రాంతంలో ఘటన జరగటంతో పోలీసులకు సోమవారం సమాచారమందింది. పోలీసులు ఆ గ్రామానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి

విజయనగరం గిరిజనుల ఆదర్శ'బాట'కు సోనూసూద్ ఫిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.