ETV Bharat / state

విశాఖలో స్వాతంత్ర వేడుకలు..రెపరెపలాడిన జాతీయ జెండా - స్వాతంత్ర దినోత్సవం 2020

విశాఖ జిల్లాలో 74వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెరేడ్ మైదానంలో మంత్రి ముత్తంశెట్టి త్రివర్ణ జెండా ఎగురవేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వాల్తేర్ డివిజన్​లో డీఆర్​ఎం చేతన్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేసి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.

విశాఖలో స్వాతంత్ర వేడుకలు..రెపరెపలాడిన జాతీయ జెండా

author img

By

Published : Aug 15, 2020, 11:45 AM IST

Updated : Aug 15, 2020, 1:29 PM IST

విశాఖ పోలీస్ పెరేడ్ మైదానంలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా పాల్గొని జాతీయ జెండా ఎగురవేసి వందనం చేశారు.

పెరేడ్ మైదానంలో జరిగిన స్వాతంత్ర వేడుకలు

జిల్లాలోని నర్సీపట్నం సబ్​కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ మౌర్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశాభివృద్ధికి రాష్ట్రాభివృద్ధికి అందరూ కృషి చేయాలని సబ్ కలెక్టర్ పిలుపునిచ్చారు

గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలోని అల్లూరి స్మారక మందిరం వద్ద జిల్లా సీపీఎం ఏఐవైఎఫ్ తదితర సంఘాల నాయకులు అల్లూరు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.తూర్పుకోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్​లో 72వ స్వాతంత్య్ర దినోత్సవాలు నిరాడంబరంగా జరిగాయి. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో వాల్తేర్ డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీ వాస్తవ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం రైల్వే ప్రోటాక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

independence day celebration in visakha dst
రైల్వే స్టేషన్ ప్రాంగణంలో త్రివర్ణ పతకాన్ని ఎగురవేసిన వాల్తేర్ డీఆర్​ఎం

ఎన్టీఆర్ భవన్​లో స్వాతంత్య్ర వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. అర్బన్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్
జాతీయ జెండాను ఎగురవేశారు.

అమర జవాన్లకు  నివాళ్లర్చించిన  తూర్పు నౌకాదళం
ఎన్టీఐర్ భవన్​లో జెండా ఎగురవేసిన తెదేపా జిల్లా అధ్యక్షుడు

సాగర తీరంలో యుద్ధ స్మారకం విక్టరీ యట్​సీ వద్ద స్వాతంత్య్ర సమర వీరులకు, అమర జవాన్లకు తూర్పు నౌకాదళం నివాళులు అర్పించింది. వైస్ అడ్మిరల్ కాళిదాసు శ్రీనివాస్ పుష్ప గుచ్చలను సమర్పించి నివాళులు అర్పించారు.

విశాఖలో స్వాతంత్ర వేడుకలు..రెపరెపలాడిన జాతీయ జెండా
అమర జవాన్లకు నివాళ్లర్చించిన తూర్పు నౌకాదళం

స్టీల్ ప్లాంట్ మైదానంలో ప్లాంట్ సీఎండీపీ.కె.రథ్ జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. దువ్వాడలోని విశాఖ స్పెషల్ ఎకనామిక్ జోన్ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. విఎస్​సీజెడ్ డెవలప్మెంట్​ కమిషనర్ ఆర్ ఎమ్​రెడ్డిజాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు.

ఇదీ చూడండి

వ్యవసాయమే 'ఆత్మనిర్భర్​ భారత్​' తొలి ప్రాధాన్యం

Last Updated : Aug 15, 2020, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.