కరోనా విశాఖ వాసులను కలవరపెడుతోంది. లాక్డౌన్ సమయంలో కేవలం పదుల సంఖ్యలో మాత్రమే ఉన్న కేసుల సంఖ్య సడలింపుల తరువాత విజృంభించింది. ప్రస్తుతం విశాఖ జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యికిపైనే ఉండగా... వందల మంది ఐసోలేషన్లో ఉన్నారు. కరోనా నివారణ దిశగా చేపడుతున్న చర్యలపై ఇంఛార్జ్ డీఎంహెచ్ఓ విజయలక్ష్మి స్పందించారు. విశాఖలో పది కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేశామని అన్నారు. ఎవరికైనా వైద్యం అందలేదని ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందిస్తున్నామని తెలిపారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎన్ఎమ్లు, ఆశా వర్కర్ల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: రైతులకు తీపి కబురు... ఉచిత బోర్లు తవ్వేందుకు ఉత్తర్వులు