పట్టణాల్లోని మధ్య తరగతికి తక్కువ ధరకు.. ప్రభుత్వం అందించనున్న ఇళ్ల స్థలాల కోసం 3,79,147 కుటుంబాలు ఆసక్తి చూపాయి. ఇందుకోసం వార్డు సచివాలయాల్లో సిబ్బంది నిర్వహించిన డిమాండు సర్వే మంగళవారంతో ముగిసింది. 150 చదరపు గజాల్లో స్థలాలకు 1,19,845 కుటుంబాలు, 200 చ.గ. స్థలాలకు 1,31,233, 240 చ.గ. స్థలాలకు 1,28,069 కుటుంబాలు ఆసక్తి కనబరిచినట్లు అధికారులు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లాల్లో అత్యధికంగా 46,675 కుటుంబాలు ముందుకొచ్చాయి. భూ సేకరణకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు వివరించారు.
ఇదీ చదవండి: పింక్ వాట్సప్ అంటూ కొత్త తరహా మోసం