Dandiya: విశాఖలోని వివిధ ప్రాంతాల్లో చిన్నా, పెద్దా అంతా నవరాత్రుల వేళ దాండియా, కోలాటం ఆడుతూ పండుగ సందడిని ఆస్వాదిస్తున్నారు. విశాఖలో దసరా సమయంలో వివిధ బృందాలు ప్రత్యేకంగా ఈ దాండియా నృత్యం ఏర్పాటు చేస్తాయి. తెలుగు, హిందీ పాటలకు హుషారుగా నృత్యాలు చేస్తూ నగర వాసులు ఆనందిస్తుంటారు. దాండియా కోసం నిపుణులైన డాన్సర్లు కూడా శిక్షణ ఇస్తుంటారు. భారతీయ సాంప్రదాయంలో ప్రాముఖ్యత ఉన్న దాండియా నృత్యాన్ని దసరా నవరాత్రులు ఆస్వాదించడం ఎంతో ఆనందాన్నిస్తుందంటున్నారు విశాఖ వనితలు. దసరా వేళల్లో చేసే ఈ నృత్యాల సందడి ఏడాది పాటు గుర్తుండిపోతుందంటున్నారు.
"భారతదేశ సంస్కృతిలో ఒక భాగమైన దాండియాలో పాల్గొన్నాము. ఎంతో ఉత్సహంగా చాలా మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా తర్వాత నిర్వహించిన ఈ నృత్యాలలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది". -ఇందు, విశాఖ వాసి
ఒకప్పుడు ఉత్తర భారతానికే పరిమితమైన ఈ దాండియా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రాచుర్యం పొందింది. దాండియా ఆటలోనే తెలియని ఉత్తేజం ఉందంటున్నారు విశాఖ మహిళలు. అందుకే దసరా పండుగ వస్తోందంటే నెల రోజులు ముందే దాండియా నృత్యాలు సాధన చేస్తామంటున్నారు.
ఇవీ చదవండి: