ETV Bharat / state

భారీ వర్షాలకు పంట మునిగింది.. రైతుకు తీరని నష్టం మిగిలింది - విశాఖ గ్రామీణ జిల్లా

చీడికాడ, మాడుగుల మండలాల్లో భారీ వర్షం రైతులకు కన్నీటిని మిగిల్చింది. కొన్ని వందల ఎకరాల్లో కోతకు వచ్చిన వరి నేలకొరిగింది. కోతకోసి కుప్పనూర్చిన పంట తడిసిముద్దయ్యింది. చేతికొచ్చిన పంట తీవ్రంగా దెబ్బతినటం వల్ల అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

crop-losses-in-visakha-due-to-heavy-rains
రైతుకు కన్నీరు మిగిలింది
author img

By

Published : Nov 23, 2020, 4:15 PM IST

Updated : Nov 26, 2020, 2:23 PM IST

విశాఖ జిల్లా చీడికాడ, మాడుగుల మండలాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల వరి పంటకు తీవ్ర నష్టం కలిగింది. చీడికాడ మండలంలోని కేఎల్బీ పట్నం, ఎల్బీపట్నం, ఖండివరం, అప్పలరాజుపురం, కోనాం, సిరిజాలలో వరి పూర్తిగా నీటమునిగింది. మాడుగుల మండలంలోని కేజే పురం, ఎం.కోటపాడు, ఘాట్ రోడ్డు, కింతలి, ఒమ్మలి తదితర ప్రాంతాల్లో వందల ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న పంట తడిసిముద్దయ్యింది.

కొన్నిచోట్ల కోతకోసి పొలాల్లో కుప్పలుగా ఉంచిన పంట తడిసింది. ఇంకొన్ని ప్రాంతాల్లో కోయడానికి సిద్ధమవుతుండగా అంతా నీటి పాలై భారీగా నష్టపోయామని రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. పంట చేతికొచ్చే సమయంలో తీవ్రంగా నష్టపోయామని.. ప్రభుత్వమే తమను అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

చోడవరం నియోజక వర్గంలో..

crop-losses-in-visakha-due-to-heavy-rains
రైతుకు కన్నీరు మిగిలింది

విశాఖ గ్రామీణ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు రైతుకు తీరని నష్టాన్ని కలిగించాయి. కోతకు వచ్చిన, కుప్పలు నూర్చిన వరి పంటంతా నీటితో నిండిపోయాయి. చోడవరం నియోజకవర్గం బుచ్చెయ్యపేట మండలంలో సుమారు 2,215 ఎకరాలల్లో కోసిన వరి తడిసిపోయింది. వడ్డాది, లోపూడి, బంగారుమెట్ట, మంగళాపురం, కుముందానిపేట, దిబ్బిడి, చిన అప్పన్నపాలెం గ్రామాల్లో ఏకధాటిగా వర్షం కురవడం వల్ల పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. అందివచ్చిన పంట పనికిరాకుండా పోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:

ఎక్కడున్నా... ఆటోను ఆపేయొచ్చు!

Last Updated : Nov 26, 2020, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.