ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో గల మల్కాన్‌గిరి జిల్లాలో జరిగే ప్రసిద్ద బోడో జాతర మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ప్రతి రెండేళ్లకొకసారి జరిగే ఈ జాతరకు ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు వస్తారు. ఈ ఏడాది కొవిడ్ కారణంగా కట్టుదిట్టమైన నిబంధనలతో జాతర చేపట్టడానికి జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది.
మంగళవారం మొదటగా తూర్పుగోదావరి జిల్లా పొల్లురు నది ఘాట్ వద్ద బాలరాజు, కన్నంరాజు, పోతురాజు విగ్రహ మూర్తులకు పూజలు నిర్వహించారు. ప్రత్యేక పడవ మీద నదిని దాటించి మన్నెం కొండ వద్దకు తీసుకొస్తారు. ఈ వేడుక నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: