AP JAC Amaravati Chairman Bopparaju Venkateswarlu: ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగులు 92 రోజులుగా చేసిన ఉద్యమం ఫలితంగా ప్రభుత్వం స్పందించిందని, ఇప్పటికే కొన్ని జీవోలు ఇచ్చారని, మరి కొన్ని హామీలు నెరవేర్చారని.. ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మా ఆయుధాలు మాకు ఉన్నాయని బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. 60 రోజుల్లో ఎన్ని హామీలు నెరవేరుస్తారో వేచి చూస్తామని చెప్పారు. విశాఖలో రెవెన్యూ ఉద్యోగ సంఘం భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా 92 రోజులు ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. నల్ల బ్యాడ్జీలతో ఉద్యమాన్ని మొదలు పెట్టి... ప్రభుత్వంతో రూ. 604 కోట్లు బకాయిలు తిరిగి చెల్లించేలా చేసుకున్నామన్నారు. ఉద్యోగుల పోరాటం వల్లే కారుణ్య నియమకాలపై స్పష్టత వచ్చిందని తెలిపారు. తమ పోరాటం వల్లే అనేక సమస్యలు పరిష్కారమయ్యాయని బొప్పరాజు వెల్లడించారు.
ఉద్యోగుల కోసం గ్రీవెన్సు డే నిర్వహించాలి: మొత్తం 2 లక్షలు మంది ఉద్యోగులు ఉంటే... వారిలో లక్ష మంది మాత్రమే ఆప్కోస్లో ఉన్నారని. మిగిలిన లక్షమందిని ఆప్కోస్లోకి తీసుకు రావాల్సిన అవసరం ఉందని బొప్పరాజు పేర్కొన్నారు. అలాగే ఆప్కోస్లో 1.44 లక్షలోపు ఆదాయం ఉన్న వారికి రేషన్ కార్డులు ఎత్తేశారన్న బొప్పరాజు... రేషన్ కార్డ్ తీసివేయడంపై మాట్లడటం వల్లే ప్రభుత్వం స్పందించిందన్నారు. జిల్లా కలెక్టర్ ప్రతి నెలకోసారి ఉద్యోగుల కోసం గ్రీవెన్సు డే నిర్వహించాలని అన్నారు. చట్టానికి లోబడి కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. తమ ఉద్యమంలో గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగుల్లో మహిళ పోలీసు, పర్యావరణ కార్యదర్శి ఇబ్బందులు ప్రస్తావన చేశామన్నారు. ఈ 60 రోజుల్లో ఎన్ని హామీలు నెరవేరుస్తారో వేచి చూస్తామన్నారు. ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగాల ఎప్పుడూ ఉద్యోగుల పక్షానే నిలబడుతుందని బొప్పరాజు వెల్లడించారు. ఉద్యోగుల కోసమే పోరాడుతుందని స్పష్టం చేసారు.
సీఎం జగన్ నేరుగా హామీ: ఏపీ జేఏసీ అమరావతిరాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ రావు మాట్లాడుతూ.. ఇన్ని రోజులు ఉద్యమాన్ని నడిపిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. 48 డిమాండ్స్ పెడితే.. వాటిలో 38 డిమాండ్లను పరిష్కరించుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించలేదుకనుకే ఉద్యమించాలసి వచ్చిందని దామోదర్ రావు తెలిపారు. త్వరలో ఉద్యోగ సమస్యలపై మంత్రి వర్గంలో చర్చిస్తామని చెప్పిందన్నారు. తాము ఉద్యోగ సంఘ నాయకులుగా ఉద్యోగుల శ్రేయస్సు కోరుకున్నామన్నారు. తమను విమర్శిస్తున్న వారు ఆధారాలు ఉండే రుజువు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరిస్తామని సీఎం జగన్ నేరుగా హామీ ఇచ్చారు కనుకనే ఉద్యమాన్ని విరమించామని దామోదర్ రావు వెల్లడించారు.
- Bopparaju on OPS: పాత పింఛన్ విధానం అమలుకు ప్రభుత్వం పునరాలోచన చేయాలి: బొప్పరాజు