ETV Bharat / state

చిక్కవరం ఆలయంలో సూర్యనారాయణ స్వామిని తాకిన కిరణాలు - రథసప్తమి వార్తలు

కృష్ణా జిల్లా చిక్కవరంలోని శ్రీ సూర్యనారాయణస్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సూర్యుడు ఉత్తరాయణంలోని ప్రవేశించే రోజును పురస్కరించుకుని.. రథసప్తమి జరుపుకుంటామని అర్చకులు తెలిపారు. సూర్యకిరణాలు మూలవిరాట్​ తాకడాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయానికి తరలివచ్చారు. రథసప్తమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Radha saptamini celebrationsin suryanaraya temple chikkavarma
చిక్కవరం సూర్యనారాణుడిని తాకిన భాస్కర కిరణాలు
author img

By

Published : Feb 1, 2020, 12:20 PM IST

చిక్కవరం సూర్యనారాణుడిని తాకిన భాస్కర కిరణాలు

కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరంలోని శ్రీ ఉషా పద్మిని సమేత సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేవాలయంలోని మూలవిరాట్​ను సూర్యకిరణాలు తాకాయి. సూర్యుని గమనం ఉత్తరాయణంలోకి వచ్చిన రోజును పురస్కరించుకుని... దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యదేవాలయం తర్వాత.. ఈ దేవాలయానికి అంత ప్రాశస్త్యం ఉందని అర్చకులు చెబుతున్నారు. స్వామి దర్శనార్థం భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయానికి తరలివస్తున్నారు. రథసప్తమిని పురస్కరించుకుని.. స్వామి వారికి సూర్యహోమం, అగ్నిపారాయణం, ఉషా పద్మిని సూర్యనారాయణస్వామి కల్యాణం, పల్లకీ సేవ నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో 25 నైపుణ్య కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.