ETV Bharat / state

ముగిసిన చంద్రగ్రహణం.. తెరుచుకున్న తిరుమల ఆలయ తలుపులు - Lunar Eclipse 2022 In AP

Lunar Eclipse 2022 : రాష్ట్రంలో చంద్రగ్రహణం ముగిసింది. తిరుమలలో చంద్రగ్రహణం పాక్షికంగా కనిపించింది. మధ్యాహ్నం 2.39 గంటలకు ప్రారంభమైన చంద్రగ్రహణం.. సాయంత్రం 6.27 గంటలకు ముగిసింది.

lunar eclipse 2022
lunar eclipse 2022
author img

By

Published : Nov 8, 2022, 7:46 PM IST

Lunar Eclipse 2022 In AP రాష్ట్రంలో చంద్రగ్రహణం పాక్షికంగా కనిపించింది. చంద్రగ్రహణాన్ని చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. మధ్యాహ్నం 2.39 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభం అయ్యి సాయంత్రం 6.27నిమిషాలకు ముగిసింది. సాయంత్రం 5.12 గంటల ప్రాంతంలో చంద్రగ్రహణం పూర్తిగా కనిపించింది. చీకటి పడేసరికి పాక్షిక గ్రహణంతో చంద్రుడు కనిపించాడు.

కొన్ని నగరాల్లో గ్రహణం సంపూర్ణంగా కనపడితే.. తిరుమలలో మాత్రం పాక్షికంగా కనిపించింది. గ్రహణాన్ని చూడటానికి ప్రత్యేక పరికరాలు అవసరం లేదని నిపుణులు సూచించడంతో.. ప్రజలు ఆసక్తిగా తిలకించారు. పాక్షిక చంద్ర‌గ్ర‌హ‌ణాన్ని వీక్షించ‌డంతో పాటు త‌మ కెమెరాల్లో ఆ దృశ్యాన్ని బంధించారు. చంద్రగ్రహణం దృష్ట్యా దేశవ్యాప్తంగా ఇప్పటికే ఆలయాలు మూసివేశారు. గ్రహణ కాలం ముగియడంతో ఆలయాల్లో సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నారు.

చంద్రగ్రహణం కారణంగా 11గంటల పాటు మూసివేసిన శ్రీవారి ఆలయ తలుపులను తెరిచారు. సంప్రోక్షణం పూర్తి చేసిన సిబ్బంది.. రాత్రి8 గంటల నుంచి సర్వదర్శనానికి భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. గ్రహణం వల్ల అన్నిరకాల దర్శనాలు, ఆర్జిత సేవలు, అలాగే ఇవాళ తిరుమలలో జరగాల్సిన పౌర్ణమి గరుడసేవ తితిదే రద్దు చేసిన సంగతి తెలిసిందే.

చంద్రగ్రహణం సందర్భంగా పలు ప్రాంతాల్లో రోకళ్లు నిలబెట్టారు. కృష్ణా జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో రోట్లో నీరు పోసి రోకళ్లను నిలబెట్టారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కోసూరివారిపాలెంలో, తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రోళ్లను పూలతో అలంకరించి పూజలు చేశారు. గ్రహణం సమయంలో రోకళ్లు నిలబడతాయని పెద్దలు నమ్మేవారని ఆదే నమ్మకాన్ని తామూ పాటిస్తున్నామని వారు అంటున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.