LEOPARD: తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ఆవరణలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. వందలాది ఎకరాల సువిశాలమైన విశ్వవిద్యాలయ ప్రాంగణంలో.. గత మూడు నెలలుగా చిరుత సంచరిస్తున్నట్లు.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు నమోదయ్యాయి. ఈ ప్రాంతంలో ఇటీవల కుక్కల సంఖ్య తగ్గిపోతూ ఉండటంతో.. అధికారులు సీసీ కెమెరాల రికార్డులను పరిశీలించగా.. చిరుత సంచారం బయటపడింది. కుక్కలను వేటాడేందుకు ప్రయత్నించే దృశ్యాలు కనిపించాయి. చిరుత సంచారంతో విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుతను విశ్వవిద్యాలయ ప్రాంగణం నుంచి దాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చదవండి: