కక్షిదారులు కోర్టులకు రాకుండానే వర్చువల్ లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి రామకృష్ణ అన్నారు. కేసు వివరాలతో పాటు రాజీ షరతులను మెయిల్ ద్వారా పంపినట్లయితే వాటిని పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పారు. జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు
కోర్టులు ఉండగా లోక్ అదాలత్‌ను ఎందుకు ఆశ్రయించాలనే భావన చాలామందికి ఉంటుందని న్యాయమూర్తి అన్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించే వారిలో ఒకరికి మాత్రమే తీర్పు అనుకూలంగా వస్తుందని ఆయన చెప్పారు. మరొకరు ఆపై కోర్టులను ఆశ్రయించే అవకాశముందన్నారు. తద్వారా ధనం, సమయం వృధా అవుతుందని వివరించారు. ఇరువర్గాల రాజీమార్గంతో లోక్ అదాలత్లో కేసులను పరిష్కరించడం వలన ఉభయులకు సమన్యాయం జరుగుతుందని తెలిపారు.
కోర్టుకు చెల్లించిన ఖర్చులు కూడా తిరిగి ఇవ్వటం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇరువర్గాల రాజీమార్గంతో పరిష్కరించబడినందున ఇతర న్యాయస్థానాలను ఆశ్రయించవలసిన అవసరం కూడా ఉండబోదని కలెక్టర్ నివాస్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రంపచోడవరంలో జాతీయ లోక్ అదాలత్ దినోత్సవం