ETV Bharat / state

'విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సీఎం​, ఎంపీ విజయసాయిరెడ్డిలే కారణం' - palasa latest news

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వైకాపానే కారణమని శ్రీకాకుళం జిల్లా తెదేపా అధ్యక్షుడు కూన రవికుమార్ ఆరోపించారు. పలాసకు వచ్చిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

srikakulam tdp president kuna ravi kumar
శ్రీకాకుళం జిల్లా తెదేపా అధ్యక్షుడు కూన రవికుమార్
author img

By

Published : Mar 9, 2021, 4:50 PM IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సీఎం జగన్​, ఎంపీ విజయసాయిరెడ్డిలే ప్రధాన కారణమని శ్రీకాకుళం జిల్లా తెదేపా అధ్యక్షుడు కూన రవికుమార్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు జరుగుతోందని.. కేంద్రం చెబుతున్నా ఇంకా ప్రజలను వైకాపా బుకాయిస్తుందని పలాసలో ఆయన అన్నారు. పన్నులు పెంచి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అభివృద్ధి జరగాలంటే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రాజీనామాలు చేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా: మంత్రి పెద్దిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.