శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పరిధిలోని పలు చోరీలకు పాల్పడిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏడాది మేనెలలో జరిగిన రెండు దొంగతనాలపై ఫిర్యాదు అందడంపై… పోలీసులు దర్యాప్తు నిర్వహించారు.
ఈ ఏడాది మే నెలలో చంద్రయ్యపేట వద్ద పని ముగించుకుని వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మెడలోని పుస్తెలతాడు లాక్కుని పరారయ్యాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే నెల 14వ తేదీన రాత్రి ఏడు గంటల సమయంలో మున్సిపాలిటీ వాటర్ ట్యాంక్ పరిధిలోని ఓ మహిళ మెడలో రెండున్నర తులాల బంగారం పుస్తెలతాడు గుర్తుతెలియని వ్యక్తి లాక్కుని పరారయ్యాడు. ఈ విషయంపై అదే రోజు మధ్యాహ్నం బాధితురాలు పోలీసుకు ఫిర్యాదు చేసింది.
ఈ కేసులపై దర్యాప్తు చేపట్టిన సీఐ కోటేశ్వరరావుకి మే 31వ తేదీన వచ్చిన సమాచారం మేరకు కొర్లకోట గ్రామానికి చెందిన పి.నితీష్ కుమార్ని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రెండు బంగారు పుస్తెల తాడులను స్వాధీనపరుచుకున్నారు. నిందితుడు గుంటూరులో విజేపీ డీఎల్పీ కళాశాలలో బీఎస్సీ సెకండియర్ చదువుతున్నాడని శ్రీకాకుళం డీఎస్పీ ఎం.మహేంద్ర తెలిపారు. చెడు అలవాట్లకు బానిసై దొంగతనానికి పాల్పడ్డాడని ఆయన వెల్లడించారు.
ఇదీ చూడండి. Anandayya medicine: ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్.. కానీ..!