శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏటా ఏర్పాటు చేసే బాణసంచా దుకాణాలు ఈసారి కరోనా కారణంగా ఏర్పాటు చేయకపోవడంతో వినియోగదారులు అసౌకర్యాలకు గురయ్యారు. శ్రీకాకుళానికి దగ్గరలో ఉన్న పూడివలస, తోటపాలెంలో మాత్రం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అనుమతులు ఉన్న షాపులు కావడంతో.. విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఫలితంగా బాణసంచా వినియోగదారులు నానా ఇబ్బందులు పడ్డారు.
వారు పట్టించుకోవడం లేదు..
రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు పట్టించుకోక పోవడంతో వినియోగదారులు అవేదన వ్యక్తం చేశారు. ఎంఆర్‌పీ ధరలపై కాకుండా ఇష్టానుసారంగా అమ్మకాలు జరుగుతున్నాయని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు హరిత దీపావళి చేసుకుందామన్న కలెక్టర్ నివాస్.. ప్రతీ ఒక్కరూ ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు.