ఫొని తుపాన్ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు, వీఆర్వోలతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తీర ప్రాంత సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక అధికారి బి. రాజగోపాల్ తెలిపారు. తుపాన్ కారణంగా విద్యుత్ సమాచార వ్యవస్థ తీవ్ర ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నందున ముందస్తు రక్షిత పథకాలు, తాగు నీటి నిల్వలు ఉంచుకోవాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. తుపాన్ కారణంగా ఎటువంటి ఆస్తి నష్టం కలగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. తహసీల్దార్ , ఎంపీడీవోలు తగు జాగ్రత్తలు, సలహాలు ఇచ్చారు.
ఇదీ చదవండీ :