ETV Bharat / state

పెనుకొండలో రెచ్చిపోయిన బైక్​ రేసర్లు.. పది మంది అరెస్ట్​ - youths were arrested

Police arrested ten bike racers: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని బాబయ్య స్వామి దర్గా గంధం వేడుకలకు వచ్చిన పలువురు యువకులు పెనుకొండ శివారులోని ఆర్టీవో చెక్ పోస్ట్ సమీపంలో బైక్ రేసింగ్ నిర్వహిస్తుండగా పోలీసులు పది మందిని అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై వివరించారు.

పదిమంది బైక్ రేసర్లు అరెస్ట్.. కోర్టులో హాజరు పరిచిన పోలీసులు

author img

By

Published : Jan 6, 2023, 7:20 PM IST

Police arrested ten bike racers: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ప్రతిష్టాత్మక బాబయ్య స్వామి దర్గాకు అతి సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై, స్థానిక యువకుల బైక్ రేసింగ్ విన్యాసాలతో భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బాబయ్య స్వామి దర్గా 750వ గంధం మహోత్సవాలు ఇటీవల అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను తిలకించడానికి కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివస్తున్నారు.

దర్గాను దర్శించుకుందామనే భక్తులకు జాతీయ రహదారిపై విచ్చలవిడిగా ప్రమాదకరంగా చేస్తున్న బైక్ రేసింగ్​తో, ప్రయాణికులు అగచాట్లకు గురవుతున్నారు. బైక్ రేసింగ్ చేస్తున్న యువకులు.. అందుకు సంబందించిన తమ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. స్థానికంగా ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీవో చెక్ పోస్ట్ సమీపంలో బైక్ రేసింగ్ నిర్వహిస్తుండగా పది మందిని అరెస్టు చేసిన ఎస్సై రమేష్ బాబు, సిబ్బంది. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై వివరించారు.

పెనుకొండలో రెచ్చిపోయిన బైక్​ రేసర్లు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.