Paritala Sunitha Padayatra: పోలీసులకు డీఏలు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందని తెదేపా మాజీ మంత్రి పరిటాల సునీత విమర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలంలో రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పరిటాల సునీత రైతులతో కలిసి 15 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభ నిర్వహించారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడుతున్నారు, ఈ మీటర్లు భవిష్యత్ లో రైతులకు ఉరితాళ్లుగా మారనున్నాయని ఆమె అన్నదాతలను హెచ్చరించారు.
రైతు సమస్యలపై తాను నిర్వహిస్తున్న పాదయాత్రకు రాప్తాడు నియోజకవర్గంలో పెద్దఎత్తున స్పందన వస్తోందని చెప్పారు. పాదయాత్రకు వస్తున్న రైతులు, ప్రజలను చూసి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి గుండెల్లో దడపుడుతోందని, దీంతో పోలీసులతో అడ్డుకునే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి జాకీ పరిశ్రమ యజమాన్యాన్ని బెదిరించి 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేయటంవల్లనే, జిల్లా నుంచి పరిశ్రమ తరలిపోయిందన్నారు. ఈ పరిశ్రమను తరిమేసి ఆరు వేల మంది మహిళల ఉపాధికి ప్రకాశ్ రెడ్డి గండికొట్టారని పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడు నియోజకవర్గ రైతులు, ప్రజలు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి సోదరుల అరాచకాలతో విసిగిపోయారని, వీళ్లను ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని ఆమె చెప్పారు
"పాదయాత్రకు వస్తున్న రైతులు, ప్రజలను చూసి ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డికి గుండెల్లో దడపుడుతోంది. ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి జాకీ పరిశ్రమ యజమాన్యాన్ని బెదిరించి 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేయటంవల్లనే, జిల్లా నుంచి పరిశ్రమ తరలిపోయింది. రాప్తాడు నియోజకవర్గ రైతులు, ప్రజలు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి సోదరుల అరాచకాలతో విసిగిపోయారు" - పరిటాల సునీత, మాజీ మంత్రి
ఇవీ చదవండి: