TDP serious about stone pelting: యర్రగొండపాలెంలో చంద్రబాబుపై హత్యాయత్నం జరిగిందని తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల ఆరోపించారు. చంద్రబాబుపై దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందని భావిస్తున్నట్లు కనకమేడల పేర్కొన్నారు. మంత్రి సురేశ్, వైసీపీ కార్యకర్తలపై హత్యాయత్నం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పర్యటనలో వైసీపీ నేతలు, కార్యకర్తలు కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని ఎంపీ కనకమేడల ఆరోపించారు. నిన్నటి ఘటనలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని కనకమేడల ఆరోపించారు. సభ్యసమాజం తలదించుకునేలా మంత్రి సురేశ్ వైఖరి ఉందంటూ దుయ్యబట్టారు. వైసీపీ కార్యకర్తలు, గూండాలను మంత్రి సురేశ్ రెచ్చగొట్టారని ఎంపీ కనకమేడల మండిపడ్డారు.
ఒక క్యాబినెట్ మంత్రి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని ప్రతిపక్ష నేతను అడ్డుకొవడం మెుదటి తప్పు. నిన్న చంద్రబాబు పర్యటన నేపథ్యంలో యువకులను చేరదిశారు. కర్రలు పట్టుకొని వారు తీరుగుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒ మంత్రి హోదాలో ఇలా దళితుల పేరుతో ఇతర సమాజీక వర్గం ప్రజలతో ఆందోళన చేయడం, వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం దురదృష్టకరం:'- కనకమేడల రవీంద్ర కుమార్, తెలుగుదేశం పార్టీ ఎంపీ
వైసీపీ ప్రభుత్వంలో దళిత మంత్రులంతా జగన్మోహన్ రెడ్డి బానిసల్లా మారారని.. తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రిగా ఉండి చొక్కా విప్పి గంజాయి తాగిన వ్యక్తిలా మంత్రి సురేష్ వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. సజ్జల చెబితే చొక్కా విప్పడానికి సురేష్‌కు సిగ్గుండాలని.. వర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత యువకుడు డ్రైవర్ సుబ్రమణ్యాన్ని ఎమ్మెల్సీ చంపేస్తే దళిత మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. దళితులకు ప్రమోషన్లల్లో కూడా రిజర్వేషన్లు పెట్టి ఘనత చంద్రబాబుదని గుర్తు చేసారు. దళిత సంక్షేమం బహిరంగ చర్చకు సిద్దమా అని వర్ల , వైసీపీ నేతలకు సవాల్ చేశారు.
చంద్రబాబు అధికారంలో ఉండగా.. దళితులకు అనేక కార్యక్రమాలు చేపట్టామని వర్ల రామయ్య గుర్తుచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎంత మంది పథకాల ద్వారా లబ్ధి పొందారో చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు. అంబేడ్కర్ పేరు తీసి జగన్ పేరు పెట్టినప్పుడే.. వైసీపీలో దళితులకు ఎలాంటి గౌరవం ఉందో తెలుస్తుందని వర్ల రామయ్య మండి పడ్డారు. వైసీపీలో దళితులకు గౌరవం లేదని పేర్కొన్నారు. మంత్రి ఆందోళన కార్యక్రమం చేస్తారని పోలీసులకు ముందే చెప్పానని వర్ల పేర్కొన్నారు. అయినా పోలీసులు పట్టించుకోలేదని తెలిపారు. పోలీసులు వైసీపీకి అనుకులంగా వ్యవహరించారని ఆరోపించారు. ఐఆర్ఎస్ ఆఫీసర్ గా చేసిన ఆదిమూలపు సురేష్ చేయాల్సిన పనులా అని దుయ్యుబట్టారు. నిన్న జరిగిన ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరును గవర్నర్ కు తెలియజేస్తాం.
ఇవీ చదవండి: