ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో టిప్పర్లలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తులను ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. వెల్లంపల్లి వద్ద వాహనాల తనిఖీల్లో నాలుగు టిప్పర్ లారీలలో అక్రమ ఇసుక తరలింపును అధికారులు అడ్డుకున్నారు. లారీలను సీజ్ చేసి... నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 76 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి :