ETV Bharat / state

ఇళ్ల మధ్య మద్యం దుకాణం వద్దని.. మహిళల ఆందోళన - ప్రకాశం జిల్లా

జనావాసాల మధ్యలో మద్యం దుకాణం ఏర్పాటు చేయటాన్ని నిరసిస్తూ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

మద్యం దుకాణం తొలగించాలని మహిళల ఆందోళన
author img

By

Published : Sep 28, 2019, 12:03 PM IST

మద్యం దుకాణం తొలగించాలని మహిళల ఆందోళన
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎస్టీ కాలనీలో ఇళ్ల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయటంతో కోపోద్రిక్తులైన మహిళలు ఆందోళనకు దిగారు. మహిళలంతా కలిసి తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి... మద్యం దుకాణం తొలగించాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం వినుకొండ-యర్రగొండపాలెం రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన మద్యం దుకాణం వలన ఆర్ధిక, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని.. వెంటనే దుకాణాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ ముక్కంటి సంఘటనాస్థలానికి చేరుకొని మహిళలతో చర్చించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.

ఇదీ చదవండి : రాంగ్‌ కాల్‌తో ప్రేమ వివాహం... రాంగ్‌ రూట్‌లో సంసారం...

Intro:jk_ap_knl_52_27_arati_loss_a&b&c_pkg_AP10055 s.sudhakar, dhone కర్నూలు జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ప్యాపిలి మండలం నల్లమేకలపల్లి గ్రామంలో రెండు రోజుల కిందట భారీ వర్షం కురుసింది. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. అరటి తోటలు నేలకు ఒరిగాయి. ఈ గ్రామంలో 50 ఎకరాలలో అరటి తోటలు దెబ్బతిన్నాయి. ఈ ఉధృతికి అరటి చెట్లు, గెలలు కొట్టుకుపోయాయి. నెల రోజుల్లో కోతకు వచ్చే పంట కొట్టుకుపోయిందని రైతులు ఆవేదన వక్తం చేస్తున్నారు. చేతికి వచ్చిన పంట ఇలా జరగడంతో నస్సహాయ స్థితిలో కర్షకులు ఉన్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. బైట్. 1. రణ సూర్యుడు రైతు, నల్లమేకలపల్లి. 2. రవి, రైతు, నల్లమేకలపల్లి. 3.రుక్మిణమ్మ రైతు 4.సాగరిక ఉద్యానవన అధికారి, డోన్.

Body:నేలకు వరిగిన అరటి

Conclusion:kit no.692, cell no.9394450169
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.