ETV Bharat / state

తగ్గిన ప్రయాణికుల రాకపోకలు.. సగానికి తగ్గిన ఆదాయం - news updates in prakasam district

కరోనా ప్రభావంతో ఏపీఎస్ఆర్టీసీకి కోలుకోలేని దెబ్బ తగులుతోంది. కొవిడ్ కారణంగా తీవ్రంగా నష్టపోయి, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్టీసీకి కరోనా సెకండ్ వేవ్ శరాఘాతంలా మారింది. గ్రామీణ ప్రాంతాలకూ వైరస్ వ్యాపిస్తుండటంతో... ప్రయాణికుల రాకపోకలు తగ్గుముఖం పట్టాయి. ప్రకాశం జిల్లాలో ఆర్టీసీకి ఆదాయం సగానికి పడిపోయింది.

Heavy losses to RTC in Prakasam district due to corona
తగ్గిన ప్రయాణీకుల రాకపోకలు
author img

By

Published : Apr 29, 2021, 7:54 PM IST

ప్రకాశం జిల్లాలోని 8 డిపోల పరిధిలో సుమారు 780 బస్సు సర్వీసులు సేవలందిస్తున్నాయి. జిల్లా నుంచి చెన్నై, బెంగళూరు వంటి నగరాలకూ బస్సులు నడుస్తున్నాయి. హైదరాబాద్​కు ప్రతి డిపో నుంచీ బస్సులు ఉన్నాయి. కరోనా కారణంగా ప్రయాణికులు లేకపోవడంతో.. కొన్ని సర్వీసులను రద్దుచేసుకోవలసి వస్తోంది. ఒంగోలు నుంచి హైదరాబాద్​కు 12 సర్వీసులు ఉండగా... ప్రస్తుతం వాటి సంఖ్య సగానికి తగ్గింది.

తగ్గిన రోజూవారీ ఆదాయం...

2019 - 20 సంవత్సరంలో 11.14 కోట్ల కిలోమీటర్లు తిరిగిన బస్సులు 2020 - 21 సంవత్సరంలో కేవలం ఐదుకోట్ల కిలోమీటర్లు మాత్రమే తిరిగాయి. ఆదాయం కూడా అప్పట్లో రూ.346 కోట్లు రాగా, ప్రస్తుతం కేవలం రూ.156 కోట్లు మాత్రమే వచ్చింది. బస్సుల్లో సీట్ల మధ్య దూరం పాటించడం వల్ల కొంత ఆక్యూపెన్సీ తగ్గింది. నెల రోజులుగా కొన్ని రూట్లలో బస్సులు ప్రయాణికులు లేకుండానే వెళ్తున్నాయి. ఫలితంగా రోజువారీ ఆదాయం కూడా బాగా తగ్గింది.

కార్మికుల్లో భయాలు...

పలు డిపోల్లో పనిచేసే సిబ్బందికి కూడా సోకడంతో.. కార్మికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కార్మికుల ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కరోనా పాజిటివ్‌ వచ్చిన వారందరికీ చికిత్స అందిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

ఇదీచదవండి.: జగన్ సర్కార్ వైఫల్యం అడుగడుగునా కనిపిస్తోంది : పోతిన మహేష్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.