ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద పరిస్థితి దయానీయంగా ఉంది. బురద, మురికి నీటి గుంతల మాయంగా మారాయి. ఫలితంగా కార్యాలయాలకు వెళ్లాలంటే మహిళలు, వృద్ధులు భయపడుతున్నారు.
సమస్యలను కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, మురికి గుంతలలో వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేసినా... వారిలో ఎటువంటి చలనం లేదని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి పరిస్థితిని చక్కదిద్దాలను ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి:
'నా సోదరుడిపై దాడి కేసులో సీసీ కెమెరా దృశ్యాలు బహిర్గతం చేయాలి'