YSRCP Leader Kodali Nani Followers Arrest in Gudivada : గత ఐదేళ్లూ అధికార అండతో రెచ్చిపోయి అంతులేని అరాచకాలకు పాల్పడిన వైఎస్సార్సీపీ (YSRCP) నేతల భరతం పట్టే పనిలో పోలీసులు పడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడలో గతంలో జరిగిన రావి టెక్స్ టైల్స్‌పై దాడి కేసులో పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో 9 మంది వైఎస్సార్సీపీ యువ నేతలను గుడివాడ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రధాన అనుచరుడు మెరుగుమాల కాళీ పరారీలో ఉన్నాడు.
2022 డిసెంబర్ 25న టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై వైస్సార్సీపీ నేతలు పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేసి అరాచకం సృష్టించారు. రాపాక పవన్ కుమార్, మెరుగుమాల ఉదయ్ కుమార్, కొండ్రు శ్రీకాంత్, భార్గవ్, సుంకర సతీష్, గొంటి అశోక్, రాజ్యబోయిన తాండవ కృష్ణ, గొల్ల వెంకటేశ్వరరావు, పండేటి మోషేను పోలీసులు అరెస్టు చేసి పెదపారుపూడి స్టేషన్ కు తరలించారు.
అంబటి హింట్ - 'నా ఇంట్లోనే ఉన్నాడు వచ్చి అరెస్టు చెయ్యండి' - షాకిచ్చిన పోలీసులు
నిందితులపై 143, 144, 145, 188, 427, 506, రెడ్ విత్ 149 BNS సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టారు. కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు, గడ్డం గ్యాంగ్ నేత మెరుగుమాల కాళీ పరారీలో ఉన్నాడు. కాళీ బయట రాష్ట్రానికి పరారైనట్లు గుర్తించిన పోలీసులు ప్రత్యేక బృందంతో గాలింపు చేపట్టారు. వరుస అరెస్టులతో వైఎస్సార్సీపీ అరాచకవాదుల వెన్నులో వణుకు మొదలైంది.
ఆరు కేసుల్లో నిందితుడు -అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన పోలీసులు - చివరకు ఏం జరిగిందంటే!