PSLV-C59 Launch Postponed To Tomorrow Due To Technical Issue : శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం చేపట్టాల్సిన పీఎస్‌ఎల్‌వీ-సీ59 ప్రయోగం వాయిదా పడింది. కౌంట్‌డౌన్ ప్రక్రియ ఏకధాటిగా 25.30 గంటల పాటు కొనసాగిన అనంతరం బుధవారం సాయంత్రం 4.08 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ59 నింగిలోకి దూసుకెళ్లేందుకు శాస్త్రవేత్తలు పూర్తి ఏర్పాట్లు చేశారు. కానీ అనుకోకుండా ఉపగ్రహంలో సాంకేతిక లోపం కారణంగా కౌంట్‌డౌన్ నిలిపివేసి వాయిదా వేశారు. మళ్లీ గురువారం సాయంత్రం 4.12 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ59 నింగిలోకి పంపుతామని ఇస్రో ప్రకటించింది. గురవారం యురోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సీ59 కక్ష్యలోకి తీసుకెళ్లనుంది.
ISRO PROBA 3 Mission: ఈ పీఎస్‌ఎల్‌వీ-సీ59/ప్రోబా-3 మిషన్‌లో.. కరోనాగ్రాఫ్ స్పేస్‌క్రాఫ్ట్ (CSC), ఓకల్టర్ స్పేస్‌క్రాఫ్ట్ (OSC) అనే రెండు అంతరిక్ష నౌకలు ఉంటాయి. ఈ రెండింటి బరువు సుమారు 550 కిలోలు. వీటిని 'స్టాక్డ్ కాన్ఫిగరేషన్'లో అంటే ఒకదానిపై మరొకటి అమర్చి రెండింటినీ కలిపి ఒకేసారి ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగం కోసం ఇస్రో తన అత్యంత విశ్వసనీయమైన, సమర్థవంతమైన PSLV (పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్) రాకెట్ XL వెర్షన్‌ను ఉపయోగిస్తోంది. ఇస్రో దగ్గర ఉన్న మొత్తం ఐదు PSLV వేరియంట్స్‌లో ఇది మోస్ట్ పవర్ ఫుల్ రాకెట్. ఈ రాకెట్ సాధారణ PSLV కంటే చాలా శక్తివంతమైనది. ఎందుకంటే సాధారణ PSLV రాకెట్ 4 బూస్టర్లను మాత్రమే ఉండగా ఇది 6 పెద్ద బూస్టర్లను కలిగి ఉంటుంది.
దీని ఒక్కో బూస్టర్ 12 టన్నుల ప్రొపెల్లెంట్ (రాకెట్‌కు ఫ్యూయెల్ వంటిది) క్యారీ చేయగలదు. PSLV-XL రాకెట్ అనేది భారతదేశపు మొట్ట మొదటి లిక్విడ్ ఫేజ్ వెహికల్. ఇది ఫ్యూయల్, లిక్విడ్ ఫ్యూయల్ రెండింటినీ ఉపయోగించుకుంటుంది. ఈ రెండు రకాల ఫ్యూయెల్స్ కలయిక వల్ల రాకెట్‌కు ఎక్స్ట్రా పవర్ లభిస్తుంది. దీంతో ఇది నార్మల్ PSLV రాకెట్ కంటే ఎక్కువ బరువున్న శాటిలైట్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లగలదు.
ఈ మేరకు ఈ 'PSLV-C59/Proba-3' మిషన్ కోసం కోసం అత్యంత విశ్వసనీయమైన, సమర్థవంతమైన PSLV (పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్) రాకెట్ సిద్ధంగా ఉందని ఇస్రో 'X'లో తెలిపింది. ఇది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ మిషన్. దీన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) అభివృద్ధి చేసింది.
ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం?: ఈ ప్రోబా-3 మిషన్ ప్రయోగం సూర్యుని బయటి పొర అయిన సోలార్ కరోనాను అధ్యయనం చేసేందుకు ఉపయోగపడుతుంది. ఇందుకోసం PSLV-XL రాకెట్ ఈ ESA 'ప్రోబా-3' ఉపగ్రహాలను సరైన కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. అనంతరం ఈ రెండు ఉపగ్రహాలు పరస్పరం సమన్వయంతో ఒక క్రమపద్ధతిలో భూకక్ష్యలో విహరిస్తాయి. ఈ తరహా ప్రయోగాన్ని చేపట్టడం ప్రపంచంలోనే ఇదే మొట్ట మొదటిసారని ESA తెలిపింది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ మంగళవారం మధ్యాహ్నం 3:08 గంటలకు ప్రారంభమయింది.
ఇస్రో మరో అద్భుత ప్రయోగం.. ఈసారి ఏకంగా సూర్యుడిపైనే.. కౌంట్‌డౌన్ స్టార్ట్..!