ప్రకాశంజిల్లా యద్దనపూడి మండలం పూనూరులో విషాదం చోటుచేసుకుంది... సినీ హీరో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీ కడుతూ విద్యుదాఘాతానికి గురై ఒకరు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పూనూరుకు చెందిన వంకాయలపాటి సుగుణరావు(40), బేతపూడి వాసు, చింతల వాసు, ఉసిరిపాటి ఆషేరు సినీ హైరో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా గ్రామ కూడలిలో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్నారు. ఇంతలోనే విద్యుత్ తీగలు తగిలి ఆ నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే చిలకలూరిపేట వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ వంకాయలపాటి సుగుణరావు(40) మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన బేతపూడి వాసు, చింతల వాసు, ఉసిరిపాటి ఆషేరుల పరిస్దితి విషమంగా ఉంది. వారిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించారు.
అభిమాన హీరో ఫ్లెక్సీ కడుతూ… విద్యుదాఘాతంతో మృతి
అభిమాన కథానాయకుడి పుట్టినరోజు వేడుకలు చేసేందుకు వారు సిద్ధం అయ్యారు. హుషారుగా ఫ్లెక్సీలు కడుతూ సందడి చేస్తున్నారు..ఇంతలో అంతులేని విషాదం అలుముకుంది. మృత్యువు విద్యుదాఘాతం రూపంలో వారిలో ఒకరి ప్రాణాన్ని బలికొంది. అప్పటి దాకా సంతోషంలో తేలిన ఆ ప్రదేశంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది.