పొదిలి నగర పంచాయితీ కార్యాలయం ఎదుట ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు. ఐదు నెలలుగా తమ వేతనాలు పెండింగ్లో ఉన్నాయంటూ.. డెబ్భై మంది కార్మికులు ధర్నా నిర్వహించారు. తమకు పారిశుద్ధ్యం తప్ప మరో వృత్తి తెలియదని కార్శికులు అన్నారు.
ఇలా.. నెలల తరబడి వేతనాలు చెల్లించక పోతే కుటుంబ పోషణ కష్టంగా మారుతోందని.. ఆవేదన చెందారు. కొవిడ్ కాలంలో ఎంతో కష్టించిన తమను ప్రభుత్వం పట్టించుకోకపోవటం బాధాకరమని అన్నారు. వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ వేతనాలు త్వరగా ఇప్పించాలని కార్మికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:
'అవినీతికి పాల్పడుతున్నారు... తిరిగి ఎన్నికల్లో పంచుతున్నారు'