ETV Bharat / state

'మీ డబ్బు ఎవడికి కావాలి.... న్యాయం చేయండి చాలు'

ప్రకాశం జిల్లా చీరాలలో ఎస్సీ యువకుడి మృతికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు అధికారులను నేతలను నిలదీశారు. మాస్కు పెట్టుకోలేదనే కారణంతో పోలీసులు కొట్టిన దెబ్బలకు మృతి చెందిన కిరణ్ కుమార్ కుటుంబసభ్యులకు ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల రూపాయల చెక్కు అధికారులు అందించారు.

CHEERALA MASK ISSUE
http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/24-July-2020/8154349_333_8154349_1595586530997.png
author img

By

Published : Jul 24, 2020, 4:11 PM IST

చీరాల మాస్క్ వివాదం:'మాకు కావాల్సింది డబ్బు కాదు న్యాయం'

ప్రజాస్వామ్య దేశంలో మనిషిని పోలీసులు కొట్టిచంపే హక్కు ఉందా... అని ప్రకాశం జిల్లా చీరాలలో అధికారులను ఎస్సీ యువకుని బంధువులు నిలదీశారు. మాస్కు పెట్టుకోలేదని పోలీసులు కొట్టిన దెబ్బలకు ఎరిజర్ల కిరణ్ కుమార్ అనే యువకుడు మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని. జాయింట్ కలెక్టర్ వెంకట మురళీ, ఒంగోలు ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి, చీరాల డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పరామర్శించారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 10 లక్షలరుపాయల చెక్కును కుటుంబ సభ్యలకు అందజేశారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎవరైనా తప్పుచేస్తే పోలీసులు స్టేషన్​కు తీసుకెళ్లి కేసు పెట్టాలి... అంతేకాని కొట్టిచంపే హక్కు ఎవరిచ్చారని అధికారులను నిలదీశారు. కిరణ్ మృతికి కారణమైన ఎస్.ఐ విజయ్ కుమార్, మిగిలిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తిగా విచారించి ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి-మాస్క్ వివాదం: చీరాల ఎస్సై దాడిలో యువకుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.