ETV Bharat / state

ఒక గేటు కొట్టుకుపోయినా బుద్దిరాలేదు - ఇప్పుడు మరో గేటు తెగిపడింది ! గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్వాహణపై విపక్షాల ధ్వజం - Gundlakamma project second gate washed away

AP Govt Negligence on Irrigation Projects: గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్వహణపై మరోసారి ప్రభుత్వ వైపల్యం బయటపడింది. గతేడాది రిజర్వాయర్ మూడో గేటు కొట్టుకుపోయినా, ప్రభుత్వానికి కదలిక రాలేదు. తాజాగా శుక్రవారం రాత్రి మరో గేటు కొట్టుకుపోవడంతో అధికారులు అప్రమత్తమైయ్యారు. స్టాప్ లాక్​ ఏర్పాటు ప్రయత్నాలు విఫలం కావడంతో మరో 3 గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ప్రభుత్వ మొద్దనిద్రతోనే ఈ వరుస వైఫల్యాలు చోటుచేసుకుంటున్నాయని విపక్షాలు విమర్శల దాడికి దిగాయి.

AP_Govt_Negligence_on_Irrigation_Projects

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 9, 2023, 9:44 PM IST

Updated : Dec 9, 2023, 10:02 PM IST

AP Govt Negligence on Irrigation Projects: శుక్రవారం రాత్రి గుండ్లకమ్మ రిజర్వాయర్ స్పిల్ వే రెగ్యులేటర్​కు సంబంధించిన గేటు కొట్టుకుపోయింది. ప్రాజెక్టు కనీస నిర్వహణ కూడా లేకపోవడంతో ఒక్కో గేటు విరిగిపడుతున్నాయి. దీంతో ప్రాజెక్టులోని నీరంతా సముద్రంపాలవుతోంది. నీటి ప్రవాహాన్ని ఆపేందుకు గేటుకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయనున్న స్టాప్ లాక్‌ ఏర్పాటుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. స్టాప్‌ లాక్‌ గేటును పైనుంచి కిందకు దింపే ప్రక్రియలో క్రేన్ సరిగా పనిచేయకపోవడం, విద్యుత్తు సరఫరా పూర్తిస్థాయిలో లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. స్టాప్‌ లాక్ కింద వరకు వచ్చి ఒక పక్కకు వాలిపోవడంతో దాన్ని సరి చేయడానికి తంటాలు పడుతున్నారు.

వృథాగా పోతున్న నీళ్లు: మోటార్లు నడవడానికి త్రీ ఫేస్ విద్యుత్తు సరఫరా లేకపోవడం వల్ల పనులకు అంతరాయం ఏర్పడుతుంది. మరో వైపు ప్రాజెక్ట్‌లో దాదాపు రెండున్నర టీఎంసీల నీరు ఉండటంతో ఉద్ధృతి ఎక్కువగా ఉంది. నీటి ప్రవాహం, నిల్వలు తగ్గితే గానీ స్టాప్ లాక్ ఏర్పాటుకు వీలు పడదు. ఈ కారణంగా అధికారులు 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

Gundlakamma Reservoir Project Gate Washed Away: గతేడాది ఆగస్టు 31న గుండ్లకమ్మ రిజర్వాయర్ మూడో గేటు కొట్టుకుపోయింది. అప్పట్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సందర్శించి నెల రోజుల్లో కొత్త గేటు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రిజర్వాయర్ నిర్వహణకు నిధులు మంజూరు చేస్తామన్నారు. 15 గేట్లను పరిశీలించి సమస్యలు ఉంటే సరిదిద్దుతామన్నారు. ఆ మాటలన్నీ నీటిమూటలయ్యాయి. అప్పటినుంచి నిర్వహణను అస్సలు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు రెండో గేటు కొట్టుకుపోయింది. ప్రాజెక్టులో నీరంతా వృథాగా సముద్రంలోకి పోతోంది.

మరో సారి కొట్టుకుపోయిన గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు-జలాశయాన్ని గాలికొదిలేసిన వైసీపీ ప్రభుత్వం

ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత వల్లే గుండ్లకమ్మ ప్రాజెక్టు (Kandula Obula Reddy Gundlakamma Reservoir Project) గేట్లు కొట్టుకుపోతున్నాయని తెలుగుదేశం మండిపడింది. గత ఏడాది మూడో నెంబర్ గేటు కొట్టుకుపోయినప్పటికీ కనీసం ప్రాజెక్టు మీద దృష్టి పెట్టలేదని తెలుగుదేశం నాయకులు విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వానికి ప్రాజెక్టుల్లో, నదుల్లో ఉన్న ఇసుకను దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ, ప్రాజెక్టు నిర్వహణలో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మరమ్మతుల కోసం కోటి రూపాయలు కూడా విడుదల చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వ ఉండడం సిగ్గుచేటని తెలుగుదేశం నేతల ధ్వజమెత్తారు.

జనసేన నేతలతో కలిసి ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించిన తెలుగుదేశం నేతలు జలవనరులశాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు రెండో గేటుని ఎప్పటిలోగా ఏర్పాటు చేయగలరని అధికారులను అడిగారు. గతేడాది మూడో గేటు పోయినప్పుడే అప్రమత్తమై ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే గేట్లు కొట్టుకుపోతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పెట్టేందుకు కూడా నిధులు ఇవ్వలేని దుస్థితిలో జగన్ : నారా లోకేశ్

AP Govt Negligence on Irrigation Projects: ప్రాజెక్టుల పట్ల నాలుగున్నరేళ్ల నిర్లక్ష్యం - గుండ్లకమ్మ నుంచి వృథాగా పోతున్న నీళ్లు

Last Updated : Dec 9, 2023, 10:02 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.