ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని 30వ వార్డులో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్తు తీగ ప్రమాదకరంగా మారింది. ట్రాన్స్ఫార్మర్ నుంచి తీగలు కిందికి వేలాడుతున్నాయి. దానికి కనీస రక్షణను ఏర్పాటు చేయకపోవడం వల్ల స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమీపంలో పాఠశాలలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: కత్తితో బెదిరించి చోరీకి పాల్పడిన యువకుడు అరెస్ట్