నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలోని వెంకట్రావుపల్లి సచివాలయంలో.. వైకాపా నేత ఆండ్ర సుబ్బారెడ్డి మద్యం సేవించి చిందులు తొక్కారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో తన ఓటమికి.. సొంత పార్టీ నాయకులే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ శ్రావణ్ కుమార్ వల్లే తాను గెలవలేకపోయానని ఆరోపించారు.
వార్డ్ కౌన్సిలర్‌గా పోటీచేసిన ఆండ్ర సుబ్బారెడ్డి.. ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి శివకోటా రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి మద్యం సేవించి వీధుల్లో తిరుగుతూ ఓటర్లను నిందిస్తున్నారు. ఇప్పుడు సచివాలయంలోకి వెళ్లి సిబ్బందిని దుర్భాషలాడుతూ చిందులేశారు. ఈ తతంగాన్ని కొందరు సెల్ ఫోన్‌తో చిత్రీకరించడంతో.. విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో స్థానికంగా వైరల్ అయింది.
ఇదీ చదవండి: