ETV Bharat / state

'నెల్లూరు డివిజన్​లో మొక్కల పెంపకానికి తొలి ప్రాధాన్యం' - nellore latest news updates

నెల్లూరు డివిజన్​లో మొక్కల పెంపకానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని... నెల్లూరు డీఎఫ్ఓ తెలిపారు. జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్​ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

'Top priority for planting in Nellore division' said nellore DFO
'నెల్లూరు డివిజన్​లో మొక్కల పెంపకానికి తొలి ప్రాధాన్యం'
author img

By

Published : Jun 27, 2020, 6:37 AM IST

డివిజన్ పరిధిలో మొక్కల పెంపకానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని నెల్లూరు డీఎఫ్ఓ షణ్ముఖ కుమార్ తెలిపారు. కంపా కార్యక్రమంలో భాగంగా నెల్లూరు డివిజన్​లో ఈ ఏడాది 1050 హెక్టార్లలో మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. ప్రస్తుతం 330 హెక్టార్లలో గ్రౌండింగ్ పూర్తి చేశామని పేర్కొన్నారు. వారంలోపు మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు. సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటం వల్ల మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు.

ఉదయగిరి, కావలి, ఆత్మకూరు, వెంకటగిరి, రాపూరు, సూళ్లూరుపేట పరిధిలో ఎర్రచందనం స్మగ్లింగ్​ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. చిత్తూరు, రాజంపేట, ప్రొద్దుటూరు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని వివరించారు.

ఇదీచదవండి.

డ్రగ్‌ మాఫియా ఏరివేతకు కఠిన చర్యలు: డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.