ETV Bharat / state

క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు... ఏడుగురు అరెస్టు - kavali latest news

నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటి పరిధిలోని ముసునూరులో క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడిన ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. మంగళవారం ఆకస్మికంగా దాడి చేసి ఏడుగురిని అరెస్టు చేశారు.

cricket betting gang
cricket betting gang
author img

By

Published : Nov 11, 2020, 8:48 PM IST

నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ పరిధిలోని ముసునూరులో క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడిన ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఐపీఎస్ అధికారి కేవీ మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వీరిని పట్టుకున్నారు. బెట్టింగ్ రాయుళ్ల నుంచి 17 వేల రూపాయల నగదు, 7 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామని కావలి డీఎస్పీ ప్రసాద్ వెల్లడించారు.

కావలి చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన వీరు.. ముసునూరు కేంద్రంగా ఆన్​లైన్ ద్వారా బెట్టింగ్​కు పాల్పడుతున్నట్లు గుర్తించామని వివరించారు. ఈ కేసులో ప్రధాన బుకీ హైదరాబాద్​కు చెందినవాడని... అతన్ని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ చెప్పారు.

ఇదీ చదవండి

పదో తరగతి విద్యార్థిని కిడ్నాప్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.