నెల్లూరు జిల్లా వెంకటగిరిలో విషాదం చోటుచేసుకుంది. ఎండ తీవ్రతతో పాటు అనారోగ్యం కారణంగా 24 గంటల వ్యవధిలో వృద్ధ దంపతులు తనువు చాలించారు. హైదరాబాద్కు చెందిన రామారావు, భారతి భార్యభర్తలు. వారు గత కొంత కాలంలో వెంకటగిరిలో ఇళ్లు అద్దెకు తీసుకొని జీవనం సాగిస్తున్నారు. పేదరికం కారణంగా గత రెండు నెలలుగా కరోనా క్వారంటైన్ కేంద్రంలో ఉంటున్నారు.
ఆరోగ్యం సరిగా లేకపోవటంతో గురువారం భారతిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. శుక్రవారం ఆమె భర్త రామారావు కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. వారి మృతితో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు, పోలీసుల సహకారంతో వీరి అంత్యక్రియలను నిర్వహించారు.