నెల్లూరు జిల్లా నాయుడు పేట పురపాలక సంఘం కార్యాలయం. ఉదయమే కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు మెుదలయ్యాయి. అప్పటికే దుకాణ సముదాయాలకు వేలం పాటలో ఉన్నారు కమిషనర్. సమస్యపై మాట్లాడిన తర్వాత వేలం పాట నిర్వహించొచ్చు అనుకున్నారు. నాలుగైదు రోజుల నుంచి నీటి కష్టాలు అనుభవిస్తున్న మహిళలు ఇంకా కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అసహనానికి గురయ్యారు కమిషనర్. జనాలతో ఆయన బాధ వెల్లడించారు.
ఎంత చేసినా గుర్తుంచుకోవడం లేదు. ఏం తప్పు చేశానని కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మాట పడటం ఇష్టం లేదు. ఇక్కడికి వచ్చాక ఎన్నికల కోడ్‌తో ఉన్నతాధికారులు అనుమతులు ఇవ్వక పోయినా లారీ యంత్రంతో ఆరు పాయింట్లు వేసి నీరు సరఫరా చేయించా. 12 టాంకరులు తిరుగుతున్నాయి. అయినా మాపై గొడవలకు దిగుతున్నారు. మా సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారు. అంటూ మూడు సార్లు లేచి దండం పెట్టి బాధ పడ్డారు.
చివరికి మహిళలలే తొందరపడ్డాం సార్... సారీ అంటూ కమిషనర్‌కు చెప్పారు.