నెల్లూరులో ప్రవహిస్తున్న పెన్నా నదిపై మరో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులూ వంతెన నిర్మాణానికి సానుకూలంగా ఉన్నట్లు వెల్లడించారు. నగరంలోని 13వ డివిజన్లో పర్యటించిన మంత్రి.. నగరాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సర్వేపల్లి కాలువ రిటైనింగ్ వాల్ పనులను వచ్చే నెల 15 నుంచి ప్రారంభిస్తామన్నారు.
నెల్లూరులో పచ్చదనం పెంపొందించేందుకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్బాటాలు తప్ప.. అభివృద్ధి శూన్యమని విమర్శించారు.
ఇదీచదవండి.