కరోనా నివారణ దృష్ట్యా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిగా లేవన్నారు.. మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. సమస్య పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని విమర్శించారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం.. పార్టీ శ్రేణులకు కరోనా నివారణ చర్యలపై దిశానిర్దేశం చేశారన్నారు. ప్రజలకు ఈ దిశగా సహకరించాలని సూచించారని తెలిపారు. సీఎం జగన్ కు ఆ స్థాయిలో అవగాహన లేదని ఎద్దేవా చేశారు. అధికారులు ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: