నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గుండెమడకల గ్రామానికి చెందిన రైతు చీమల రఘురామిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రఘురామిరెడ్డి 20 లక్షల వరకు అప్పు చేసి 25 ఎకరాల్లో పొగాకు, పత్తి పంటలు సాగుచేశాడు. పంట దిగుబడి సరిగ్గా రాలేదు. పండిన కాస్త పంటను లాక్ డౌన్ కారణంగా అమ్ముకోలేక.. అప్పు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురయ్యాడు. పొలానికి వెళ్లి పురుగుల మందు తాగాడు.
రైతు ఎంతసేపటికీ రాకపోయేసరికి కుమారుడు వెళ్లి చూడగా అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే వింజమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరు వైద్యశాలకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న వింజమూరు తహశీల్దార్ సుధాకర్, ఎస్సై బాజిరెడ్డి రైతు భౌతిక కాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: