ETV Bharat / state

చింతలదేవి క్షేత్రానికి వ్యాధుల చింత...! - నెల్లూరు జిల్లా కొండాపురం మండలం చింతలదేవి

పశువులకు భయంకరమైన వ్యాధిసోకిందని తెలిసినా ఆ యాజమాన్యం పట్టించుకోలేదు. అమాయకపు రైతులకు అన్యాయంగా గోవులు అమ్మేశారు. అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది అసలు విషయం. ఇప్పుడు ఆ సంగతి బయట ప్రపంచానికి తెలియకుండా చూస్తోంది అధికార యంత్రాంగం.

నెల్లూరు జిల్లా భయంకరమైన వ్యాధి
author img

By

Published : Sep 18, 2019, 10:09 AM IST

రాష్ట్రానికే తలమానికం నెల్లూరు జిల్లా కొండాపురం మండలం చింతలదేవిలోని మిశ్రమ పశుగణాభివృద్ధి క్షేత్రం. ఈ కేంద్రాన్ని బ్రుసెల్లోసిస్‌ వ్యాధి కాటేసింది. పశువుల నుంచి మనుషులకు సోకే ఈ వ్యాధి ఈ క్షేత్రాన్ని చుట్టేస్తోంది. అయినా అధికారులు గోప్యంగా ఉంచడం విమర్శలకు తావిస్తోంది. సాక్షాత్తు ఏపీ లైవ్‌స్టాక్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(ఏపీఎల్డీఏ) అధికారుల బృందం వచ్చి పశువుల రక్తనమూనాలు సేకరించి తీసుకెళ్లి అధ్యయనం చేయడం పరిస్థితి తెలియజేస్తోంది.
చింతలదేవి పశుగణాభివృద్ధి క్షేత్రంలో రాష్ట్రానికే వన్నె తెచ్చే ఒంగోలు జాతి ఆవులు ఉత్పత్తి చేస్తుంటారు. దీని కోసం కేంద్రం రూ.కోట్ల నిధులు మంజూరు చేస్తోంది. అయితే ఇక్కడ పశువుల నిర్వహణపై లోపాలు ఉన్నట్లు చాలాకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం వాటిని నిజం చేస్తున్న పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. క్షేత్రంలో ఉన్న సుమారు 374 ఆవుల్లో చాలా జీవులకు బ్రుసెల్లోసిస్‌ వ్యాధి సోకినట్టు తెలుస్తోంది.

ఏమిటీ వ్యాధి..

బ్రుసెల్లా అనే బాక్టీరియా కారణంగా బ్రుసెల్లోసిస్‌ వ్యాధి వస్తుంది. ఇది పశువుల నుంచి పశువులకు, మనుషులకు సంక్రమిస్తుంది.‘పాశ్చరైజేషన్‌ జరగని పాలు తీసుకోవడం, వ్యాధితో ఉన్న పశువుల మాంసం తింటే మనుషులు ఈ రోగం బారిన పడతారు. జ్వరం, వెన్నునొప్పి, తలనొప్పి, బరువు తగ్గడం లక్షణాలతో మరణానికీ ఈ రోగం కారణమవుతోంది. 2016 డిసెంబరులో బెంగళూరులో ఈ వ్యాధి బయటపడింది. ఇప్పుడు చింతలదేవిలో వెలుగు చూడటంతో మరోసారి సమస్య తెరపైకి వచ్చింది.
ఇంతటి ప్రమాదకరమైన వ్యాధిని అంతర్గతం చేసినందుకు యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు.

చింతలదేవి క్షేత్రానికి వ్యాధుల చింత...

ఇదీ చూడండి

వయసు 26 ఏళ్లు... గిన్నీస్‌ రికార్డులు 21..

Intro:ap-rjy-101-01-exam update-avb-Ap10111
ప్రారంభమైన గ్రామ సచివాలయ ఉద్యోగుల నియామక రాత పరీక్ష 10 గంటల లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 12 వేల మంది గ్రామ సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరయ్యారు ఇందులో 64 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన విభిన్న ప్రతిభావంతులు ఉన్నారు వారికి కావలసిన ఏర్పాట్లను గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది ఆరోగ్య శాఖ సిబ్బంది చూసుకున్నారు నడవలేని వారిని పరీక్ష కేంద్రాల్లో పరీక్ష స్థలంలో కూర్చోబెట్టేందుకు వీల్ చైర్స్ ను ఉపయోగించి అభ్యర్థులను దానికి తీసుకెళ్లారు బ్యాగులు ఇతరాత్రా వస్తువులు ఏమి లేకుండా ఉచితం ప్రత్యేక పోలీసు అధికారుల పర్యవేక్షణలో పరీక్షలు ప్రారంభమయ్యాయి

Body:ap-rjy-101-01-exam update-avb-Ap10111

Conclusion:ap-rjy-101-01-exam update-avb-Ap10111
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.