నెల్లూరు జిల్లాలో వరికోతలు ప్రారంభమైనా.. ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభించలేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులు మండిపడ్డారు. నగరంలోని వ్యవసాయ కార్మిక సంఘ నాయకుల ఆధ్వర్యంలో ధాన్యం రైతుల సమస్యలపై సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం 165 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని చెప్పి.. ఇప్పటి వరకు ప్రారంభించలేదని దుయ్యబట్టారు. నాయుడుపేట, బుచ్చిరెడ్డిపాలెం తదితర మండలాల్లో కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో పంట దళారులకు అమ్ముకుంటున్నారన్నారు. మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చూడండి...